Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsముఖ్యమైన వార్తలు – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteMon, 07 Nov 2022 10:13:36 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngముఖ్యమైన వార్తలు – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232సీఎం కేసీఆర్‌పై నమ్మకంతోనే మునుగోడులో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు
https://www.prajabandhu.in/trs-won-in-munugodu-by-election/
Mon, 07 Nov 2022 10:13:36 +0000https://www.prajabandhu.in/?p=1964తాండూరు: టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడం పట్ల తాండూరు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పట్లోళ్ల దీపానర్సింలు హర్షం వ్యక్తం చేశారు. నెలరోజుల పాటు మునుగోడులోనే మకాం వేసి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకంతోనే మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించారని ఆమె పేర్కొన్నారు.
]]>
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దళితులకు ఆత్మగౌరవం
https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-distributes-dalitabandhu/
Thu, 11 Aug 2022 07:36:15 +0000https://www.prajabandhu.in/?p=1951తాండూరు: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దళితులకు ఆత్మగౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఆయన దళితబంధు పంపిణీ చేశారు. పెద్దేముల్, యాలాల్ మండలాలకు చెందిన ముగ్గురికి రెండు కార్లు, ట్రాక్టర్ అందజేశారు.
]]>నియోజకవర్గ టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా రాజుగౌడ్
https://www.prajabandhu.in/rajugoud-appointed-as-trs-spokes-person-for-tandur-constituency/
Sun, 26 Jun 2022 19:48:18 +0000https://www.prajabandhu.in/?p=1947తాండూరు: తాండూరునియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా తాండూరు పట్టణానికి చెందిన సీనియర్ నేత ఎస్.రాజుగౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం ఆయనకు నియామకపత్రం అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులను ప్రజలకు వివరించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని రాజుగౌడ్ కు సూచించారు. ఆయనతో పాటు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన శకుంతలను పార్టీ నియోజకవర్గ మహిళా విభాగం కన్వీనర్ గా నియమిస్తూ ఎమ్మెల్యే ఆమెకు నియామకపత్రం అందజేశారు.
]]>సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు: ఎమ్మెల్యే పైలట్
https://www.prajabandhu.in/mla-rohith-reddy-conducts-pattana-pragati-program-in-tandur/
Sat, 11 Jun 2022 19:58:17 +0000https://www.prajabandhu.in/?p=1943తాండూరు: తాండూరు పట్టణంలో శనివారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ కాలనీలో పట్టణ ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అంతర్గత రోడ్లు, మురుగు కాలువలను పరిశీలించారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ రోడ్లపై చెత్తలేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు.
]]>ఘనంగా ఎమ్మెల్యే పైలట్ జన్మదిన వేడుకలు
https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-birthday-celebrations/
Wed, 08 Jun 2022 11:19:22 +0000https://www.prajabandhu.in/?p=1938తాండూరు: తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణంలోని విలియం మూన్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై అభిమానంతో జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. నిస్వార్ధంగా సేవ చేసి నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన మంత్రి కేటీఆర్ ను కలిశారు.
]]>దళితుల సాధికారత కోసమే దళితబంధు..
https://www.prajabandhu.in/car-and-auto-distributes-under-dalitabandhu-scheme/
Sat, 04 Jun 2022 22:38:28 +0000https://www.prajabandhu.in/?p=1928తాండూరు: దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం దళితబంధు అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అడ్కిచెర్ల గ్రామానికి చెందిన రేవంత్ కు దళితబంధు ద్వారా మంజూరైన గూడ్స్ ఆటో, పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అర్జున్ కి మంజూరైన కారును అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
]]>ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్పీ
https://www.prajabandhu.in/tandur-dsp-sekhargoud-meets-mla-pilot-rohith-reddy/
Wed, 25 May 2022 20:06:09 +0000https://www.prajabandhu.in/?p=1915తాండూరు: తాండూరు నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శేఖర్ గౌడ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో శాంతి భద్రతల విషయంలో పోలీసులకు ఏ విధంగా సహకరించారో తనకూ అదే విధంగా సహకరించాలని డీఎస్పీ శేఖర్ గౌడ్ ఎమ్మెల్యేను కోరారు.
]]>క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే పైలట్
https://www.prajabandhu.in/mla-rohith-reddy-attends-kricket-tournament-matches/
Wed, 25 May 2022 20:00:51 +0000https://www.prajabandhu.in/?p=1907క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలిగిస్తాయని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా శాలివాహన డిగ్రీ కళాశాల మైదానం (మహాత్మ జ్యోతిబాపూలే)లో నిర్వహిస్తున్న మహిళల క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించడం శుభపరిణామమన్నారు. మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రైజ్ మనీ వివరాలు.. క్లస్టర్ పరిధిలో..
విన్నర్ టీంకు: రూ.10వేలు
రన్నర్ టీంకు: రూ.5వేలు మండల స్థాయిలో..
విన్నర్ టీంకు: రూ.20వేలు
రన్నర్ టీంకు: రూ.10వేలు నియోజకవర్గ స్థాయిలో..
విన్నర్ టీంకు: రూ.1లక్ష
రన్నర్ టీంకు: రూ.50వేలు
]]>తెలంగాణ పథకాలు.. దేశానికి ఆదర్శం: ఎమ్మెల్యే పైలట్
https://www.prajabandhu.in/cm-kcr-working-for-poor-people-welfare-says-mla-rohith-reddy/
Mon, 16 May 2022 18:03:11 +0000https://www.prajabandhu.in/?p=1904బషీరాబాద్: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం పేదల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం నూతన పథకాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల ముఖచిత్రం పూర్తిగా మారిపోయి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకొని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
]]>గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే పైలట్
https://www.prajabandhu.in/mla-rohith-reddy-concentrate-on-development-of-villages/
Wed, 11 May 2022 19:44:38 +0000https://www.prajabandhu.in/?p=1900బషీరాబాద్: బషీరాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కంసాన్ పల్లి, మర్పల్లిలో సైడ్ డ్రెయిన్లు, నవల్గా గ్రామంలో సీసీ రోడ్లు, పర్వత్ పల్లిలో ఫార్మేషన్ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి పల్లె అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. మన ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. తాండూరు పట్టణంలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్ ను యువత సద్వినియోగం చేసుకొని తమ లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.
]]>