Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsPraja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteMon, 07 Nov 2022 10:13:36 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngPraja Bandhu News Site
https://www.prajabandhu.in
3232సీఎం కేసీఆర్‌పై నమ్మకంతోనే మునుగోడులో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు
https://www.prajabandhu.in/trs-won-in-munugodu-by-election/
Mon, 07 Nov 2022 10:13:36 +0000https://www.prajabandhu.in/?p=1964తాండూరు: టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడం పట్ల తాండూరు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పట్లోళ్ల దీపానర్సింలు హర్షం వ్యక్తం చేశారు. నెలరోజుల పాటు మునుగోడులోనే మకాం వేసి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకంతోనే మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించారని ఆమె పేర్కొన్నారు.
]]>
ఎమ్మెల్యేను కలిసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్
https://www.prajabandhu.in/raju-gowd-meets-mla-pilot-rohith-reddy/
Sun, 28 Aug 2022 19:51:21 +0000https://www.prajabandhu.in/?p=1955వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ గా ఎస్.రాజుగౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.
]]>టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దళితులకు ఆత్మగౌరవం
https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-distributes-dalitabandhu/
Thu, 11 Aug 2022 07:36:15 +0000https://www.prajabandhu.in/?p=1951తాండూరు: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దళితులకు ఆత్మగౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఆయన దళితబంధు పంపిణీ చేశారు. పెద్దేముల్, యాలాల్ మండలాలకు చెందిన ముగ్గురికి రెండు కార్లు, ట్రాక్టర్ అందజేశారు.
]]>నియోజకవర్గ టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా రాజుగౌడ్
https://www.prajabandhu.in/rajugoud-appointed-as-trs-spokes-person-for-tandur-constituency/
Sun, 26 Jun 2022 19:48:18 +0000https://www.prajabandhu.in/?p=1947తాండూరు: తాండూరునియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా తాండూరు పట్టణానికి చెందిన సీనియర్ నేత ఎస్.రాజుగౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం ఆయనకు నియామకపత్రం అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులను ప్రజలకు వివరించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని రాజుగౌడ్ కు సూచించారు. ఆయనతో పాటు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన శకుంతలను పార్టీ నియోజకవర్గ మహిళా విభాగం కన్వీనర్ గా నియమిస్తూ ఎమ్మెల్యే ఆమెకు నియామకపత్రం అందజేశారు.
]]>సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు: ఎమ్మెల్యే పైలట్
https://www.prajabandhu.in/mla-rohith-reddy-conducts-pattana-pragati-program-in-tandur/
Sat, 11 Jun 2022 19:58:17 +0000https://www.prajabandhu.in/?p=1943తాండూరు: తాండూరు పట్టణంలో శనివారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ కాలనీలో పట్టణ ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అంతర్గత రోడ్లు, మురుగు కాలువలను పరిశీలించారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ రోడ్లపై చెత్తలేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు.
]]>ఘనంగా ఎమ్మెల్యే పైలట్ జన్మదిన వేడుకలు
https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-birthday-celebrations/
Wed, 08 Jun 2022 11:19:22 +0000https://www.prajabandhu.in/?p=1938తాండూరు: తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణంలోని విలియం మూన్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై అభిమానంతో జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. నిస్వార్ధంగా సేవ చేసి నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన మంత్రి కేటీఆర్ ను కలిశారు.
]]>పేదల ఆరోగ్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్
https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-distributes-cmrf-cheques-in-tandur/
Sat, 04 Jun 2022 22:42:38 +0000https://www.prajabandhu.in/?p=1931తాండూరు: పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యాలాల మండలం బషీర్మియాతాండకు చెందిన గోవింద్ కు రూ.82,500 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ సకాలంలో చెక్కులు అందేలా చూస్తామని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెల్లడించారు.
]]>దళితుల సాధికారత కోసమే దళితబంధు..
https://www.prajabandhu.in/car-and-auto-distributes-under-dalitabandhu-scheme/
Sat, 04 Jun 2022 22:38:28 +0000https://www.prajabandhu.in/?p=1928తాండూరు: దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం దళితబంధు అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అడ్కిచెర్ల గ్రామానికి చెందిన రేవంత్ కు దళితబంధు ద్వారా మంజూరైన గూడ్స్ ఆటో, పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అర్జున్ కి మంజూరైన కారును అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
]]>రేణుక ఎల్లమ్మ జాతరలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-attends-to-renuka-ellamma-talli-jatara-in-kothlapur/
Fri, 03 Jun 2022 23:44:34 +0000https://www.prajabandhu.in/?p=1924తాండూరు: తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం, సీడీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా రేణుక ఎల్లమ్మ తల్లి విశేష పూజలు అందుకుంటుందన్నారు. తాండూరు నియోజకవర్గం నుంచే కాకుండా కర్ణాటక నుంచి సైతం ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం భక్తులు వస్తుంటారని చెప్పారు.
]]>టాటా ఉత్సవాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-attends-to-tata-utsav-ai-at-america/
Sat, 28 May 2022 16:00:46 +0000https://www.prajabandhu.in/?p=1921అమెరికాలోని న్యూజెర్సీలో జరుగుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఉత్సవాల్లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. టాటా ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేను తెలంగాణ వాసులు కలుసుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. వచ్చే నెల 3న ఆయన తిరిగి స్వదేశానికి రానున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా రాష్ట్రం నుంచి 20 మంది రాజకీయ నేతలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
]]>