Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins basheerabad – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Tue, 14 Sep 2021 11:53:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png basheerabad – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 మండల అధ్యక్షులను ప్రకటించిన టీఆర్ఎస్ https://www.prajabandhu.in/trs-announced-mandal-presidents/ Tue, 14 Sep 2021 11:53:24 +0000 https://www.prajabandhu.in/?p=1265 తాండూరు: తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. తాండూరు పట్టణ అధ్యక్షుడిగా నయ్యుం అఫ్ఫు, తాండూరు మండల అధ్యక్షుడిగా రాందాస్, యాలాల మండలానికి మల్లారెడ్డి, పెద్దేముల్ మండలానికి కొహిర్ శ్రీనివాస్, బాషీరాబాద్ మండలానికి రామునాయక్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి జహంగీర్ పాషా సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుల పేర్లు వెల్లడించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కమిటీలు పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో దేశంలోనే అత్యంత వేగంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

]]>
నావంద్గీ సొసైటీ ఆధ్వర్యంలో బషీరాబాద్‌లో పెట్రోల్ బంకు ఏర్పాటు https://www.prajabandhu.in/new-petrol-bunk-will-start-in-basheerabad-by-navandgi-society/ Tue, 24 Aug 2021 07:49:18 +0000 https://www.prajabandhu.in/?p=996 తాండూరు: నావంద్గీ సొసైటీ ఆధ్వర్యంలో బషీరాబాద్‌లో నూతన పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ వెంకటరామ్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బంకు నిర్మాణం చేపట్టేందుకు గాను రూ.25 లక్షల చెక్కును ఇండియన్ ఆయిల్ సంస్థ ప్రతినిధికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. సొసైటీ లాభాలు పెరిగితే రైతులకు ఎక్కువగా రుణాలు  ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.

]]>
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచులదే https://www.prajabandhu.in/%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%89%e0%b0%82/ Mon, 23 Aug 2021 07:37:57 +0000 https://www.prajabandhu.in/?p=963 తాండూరు: బషీరాబాద్ మండలం నిళ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఆయా గ్రామాల సర్పంచులదే అని ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం సైతం చాలా అవసరమని, అందుకోసం గ్రామస్తులు ప్రజాప్రతినిథులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పిచ్చి మొక్కల నివారణ మందును ఎమ్మెల్యే పిచికారీ చేశారు.
]]>
రేపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి పర్యటన https://www.prajabandhu.in/%e0%b0%b0%e0%b1%87%e0%b0%aa%e0%b1%81-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b%e0%b0%9c%e0%b0%95%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86/ Sat, 21 Aug 2021 16:14:30 +0000 https://www.prajabandhu.in/?p=939 తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా బషీరాబాద్‌లో డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. గతంలో పనులు ప్రారంభించి పూర్తి చేసుకున్న వాటిని ఎమ్మెల్యే ప్రారంభించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

నియోజకవర్గ పర్యటన అనంతరం ఆదివారం ఉదయం 11గంటలకు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటారు. తాండూరులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి ప్రజలు వారి సమస్యలు వివరించవచ్చని తెలిపారు.

]]>
బషీరాబాద్‌ మండలంలో హత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తి https://www.prajabandhu.in/%e0%b0%ac%e0%b0%b7%e0%b1%80%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e2%80%8c-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%95/ Wed, 18 Aug 2021 06:32:34 +0000 https://www.prajabandhu.in/?p=803 తాండూరు: బషీరాబాద్‌ మండల పరిధిలోని నావంద్గీ సమీపంలో గల కర్నాటక సరిహద్దు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. ఎక్కడో హత్య చేసి శవానికి ఇక్కడ నిప్పంటించినట్లు తెలుస్తోంది. మృతుడికి 35 ఏళ్లు ఉంటాయని.. ఈ ప్రాంతంలో మృతదేహం ఉందని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు బషీరాబాద్‌ ఎస్‌ఐ విద్యాచరణ్‌ రెడ్డి తెలిపారు.

హత్యకు గురైన వ్యక్తి కర్నాటక ప్రాంత వాసి అని, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వెల్లడించారు. హతుడి వివరాల కోసం కర్నాటక పోలీసులకు సైతం సమాచారం ఇచ్చామన్నారు.

]]>