Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginscovid vaccine – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteSat, 25 Sep 2021 07:31:48 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngcovid vaccine – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-inaugurates-covid-vaccination-special-drive/
Thu, 16 Sep 2021 09:42:39 +0000https://www.prajabandhu.in/?p=1273తాండూరు: నియోజకవర్గం పరిధిలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధికారులకు సూచించారు. తాండూరు పట్టణంలోని సాయిపూర్, రాజీవ్‌కాలనీతో పాటు యాలాల మండలం అన్నాసాగర్ గ్రామంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
అంగన్‌వాడీ సిబ్బంది, ఆశావర్కర్లు ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.
]]>
ఇకపై ఇంటికే కరోనా వ్యాక్సిన్.. ఏర్పాట్లు చేస్తున‍్న అధికారులు
https://www.prajabandhu.in/%e0%b0%87%e0%b0%95%e0%b0%aa%e0%b1%88-%e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%87-%e0%b0%95%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%95%e0%b1%8d/
Fri, 20 Aug 2021 09:10:50 +0000https://www.prajabandhu.in/?p=836తాండూరు: ఇకనుంచి ప్రతీ ఇంటికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. కరోనా మొదటి, రెండవ దశల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం, థర్డ్ వేవ్ ముప్పు సైతం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే టీకా తీసుకునేందుకు మాత్రం ప్రజలు వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లడం లేదు. దీంతో వైద్య సిబ్బందే ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖను ప్రభుత్వం ఆదేశించింది.