Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsdouble bed room houses – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteMon, 06 Dec 2021 19:48:45 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngdouble bed room houses – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232మూడు నెలల్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు
https://www.prajabandhu.in/double-bed-room-houses-gives-to-benificiaries-soonly-says-mla-pilot/
Mon, 06 Dec 2021 19:48:45 +0000https://www.prajabandhu.in/?p=1458తాండూరు: పట్టణంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఖంజాపూర్ గేట్ సమీపంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేదవాడు రెండు పడకల ఇంటిలో సకల సౌకర్యాలతో బతకాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత ఆశయం మేరకే ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
త్వరలోనే అర్హులకు ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మరో మూడు నెలల్లోనే పేదల కల నెరవేరబోతుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
]]>
వేగంగా పేదల కళల సౌదాల నిర్మాణం
https://www.prajabandhu.in/%e0%b0%b5%e0%b1%87%e0%b0%97%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%aa%e0%b1%87%e0%b0%a6-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%95%e0%b0%b3%e0%b0%b2-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%a6%e0%b0%be/
Fri, 20 Aug 2021 10:00:45 +0000https://www.prajabandhu.in/?p=841తాండూరు: తాండూరు పట్టణంలో చేపట్టిన పేద ప్రజల కళల సౌదాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మిస్తున్న గృహాలు దాదాపు 80 శాతం పనులు పూర్తి చేసుకుని తుది మెరుగులు సంతరించుకుంటున్నాయి.
తాండూరు పట్టణంలో రూ. 50 కోట్ల ఖర్చుతో 1000 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల పట్ల తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లతో తరచూ సమీక్షలు నిర‍్వహించి పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.