Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins galli galliki pilot – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Wed, 01 Sep 2021 07:14:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png galli galliki pilot – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 తాండూరును ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం https://www.prajabandhu.in/will-try-to-make-tandur-as-top-muncipality-says-mla-pilot-rohith-reddy/ Wed, 01 Sep 2021 07:10:01 +0000 https://www.prajabandhu.in/?p=1212 తాండూరు: తాండూరు మున్సిపాలిటీని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్‌’ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో నిర్వహించిన ‘గల్లి గల్లికి పైలట్‌’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజలు తన పర్యటనలో పాల్గొని వారి సమస్యలు వివరించినట్లు తెలిపారు. ఐదు రోజుల పర్యటలో 790 సమస్యలను గర్తించామన్నారు.

శానిటేషన్, వీధి దీపాలు, కల్వర్టులు, సీసీ రోడ్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. గుర్తించిన ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన చాలా సమస్యలను అధికారుల సాయంతో తక్షణమే పరిష్కరించామని ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, పార్టీలకతీతంగా స్థానిక నేతలు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో తాండూరు అభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.

త్వరలోనే మంత్రి కేటీఆర్ తాండూరులో పర్యటించనున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యే అయిన మొదటి సంవత్సరం ఎన్నికలతోనే కాలం గడిచిందని.. రెండవ ఏడాది కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిందన్నారు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో పూర్తిగా అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో సైతం దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి తెలిపారు.

]]>
తాండూరును సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా https://www.prajabandhu.in/abide-to-development-of-tandur-says-mla-rohith-reddy/ Mon, 30 Aug 2021 09:03:04 +0000 https://www.prajabandhu.in/?p=1165 తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారమే థ్యేయంగా ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి తాండూరు పట్టణంలో చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 18 వార్డుల్లో ఆయన గతవారం పర్యటించారు. మరో 18 వార్డుల్లో పర్యటనకు గాను ఈ కార్యక్రమాన్ని నేడు తిరిగి ప్రారంభించారు. ఎమ్మెల్యే పర్యటనకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యే పర్యటన కొనసాగనుంది.

ప్రజలు ఆయన దృష్టికి తీసుకువస్తున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. పట్టణంలోని వార్డుల్లో నెలకొన్న అన్ని సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సైడ్ కాల్వలు, సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో తాండూరును సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు.

]]>
నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా: ఎమ్మెల్యే పైలట్‌ https://www.prajabandhu.in/will-develop-tandur-with-the-help-of-trs-govt-says-mla-pilot/ Thu, 26 Aug 2021 05:10:15 +0000 https://www.prajabandhu.in/?p=1082 తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి తాండూరు పట్టణంలో చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు పట్టణంలోని 18 వార్డుల్లో ఆయన పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. వచ్చేవారం మరో మూడు రోజుల పాటు మిగతా 18 వార్డుల్లో పర్యటన కొనసాగనుంది.

మూడు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, పూర్తి స్థాయిలో మార్పుకు కొంత సమయం పడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతుందని ఆయన అన్నారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన స్థానిక ప్రజాప్రతినిథులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

 

]]>
మూడవ రోజు కొనసాగుతున్న ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం https://www.prajabandhu.in/galli-galliki-pilot-program-successfully-going-on-third-day/ Wed, 25 Aug 2021 06:11:05 +0000 https://www.prajabandhu.in/?p=1019 తాండూరు: తాండూరు పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం మూడవ రోజైన బుధవారం కొనసాగుతోంది. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బస్తీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత క్రమంలో నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు.

తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్‌ ఏర్పాటు చేసి తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ కోసం పట్టణంలో తవ్విన గుంతలకు త్వరలోనే మరమ్మతులు చేపడతామన్నారు. పట్టణంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో భాగంగా  1, 2, 3, 4, 5, 6, 25 వార్డుల్లో ఈ రోజు పర్యటించనున్నారు.

 

]]>
రెండవ రోజు కొనసాగుతోన్న ‘గల్లి గల్లికి పైలట్‌’ కార్యక్రమం https://www.prajabandhu.in/galli-galliki-pilot-program-successfully-going-on-second-day/ Tue, 24 Aug 2021 05:57:08 +0000 https://www.prajabandhu.in/?p=987 తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారమే థ్యేయంగా తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్‌’ కార్యక్రమం రెండవ రోజు కొనసాగుతోంది. పట్టణంలోని 20వ వార్డు నుంచి రెండవ రోజు పర్యటన ప్రారంభించారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు, యువత నుంచి విశేష స్పందన వస్తోంది.

పట్టణంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి తాండూరు హైదరాబాద్ రోడ్డులోని జిపిఆర్ గార్డెన్స్ సమీపంలో జిల్లా కలెక్టర్ పౌసమి బసుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావి తరాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

]]>
ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే https://www.prajabandhu.in/ready-to-fight-with-any-one-for-tandur-people-welfare-says-mla-pilot/ Mon, 23 Aug 2021 09:24:59 +0000 https://www.prajabandhu.in/?p=971 తాండూరు: గల్లి గల్లికి పైలట్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాత తాండూరు పరిధిలోని 14, 15, 16, 17, 18 వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల గురించి స్వయంగా ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని.. ఇది ప్రజలపై వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేసే ఏ కార్యక్రమానికైనా సరే ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా సరే సహించేది లేదన్నారు. వార్డుల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అవసరమైన నిధుల మంజూరు కోసం మంత్రి కేటీఆర్‌ను కోరనున్నట్లు తెలిపారు.

తాను ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పాత తాండూరులో అర్బన్ హాస్పిటల్ మంజూరు చేయించినట్లు తెలిపారు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు సరిగ్గా లేనందునే ఆలస్యం అయ్యిందని, త్వరలోనే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

]]>
‘గల్లి గల్లికి పైలట్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పైలట్‌ https://www.prajabandhu.in/%e0%b0%97%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%97%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%88%e0%b0%b2%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95/ Mon, 23 Aug 2021 06:44:42 +0000 https://www.prajabandhu.in/?p=951
తాండూరు: పట్టణంలో సమస్యల పరిష్కారమే థ్యేయంగా చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్‌’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. పాత తాండూరులోని కోటేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర‍్వహించిన అనంతరం ఆయన పట్టణంలో వార్డుల పర్యటనకు బయలుదేరారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని పట్టణ సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.
]]>
నేటి నుంచి తాండూరు పట్టణంలో ‘గల్లి గల్లికి పైలట్‌’ కార్యక్రమం https://www.prajabandhu.in/%e0%b0%a8%e0%b1%87%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%a4%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%a3/ Mon, 23 Aug 2021 06:18:51 +0000 https://www.prajabandhu.in/?p=946 తాండూరు: తాండూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పట్టణ బాట కార్యక్రమంలో భాగంగా ‘గల్లి గల్లికి పైలట్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి వెల్లడించారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డుల్లోని ప్రతీ గల్లీలో ఆయన పర్యటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో ప్రతీ రోజూ 6 వార్డుల చొప్పున ఆయన పర్యటన కొనసాగనుంది. మూడు రోజుల పర్యటన అనంతరం ఈ నెల 30, 31, అక్టోబర్‌ 1వ తేదీల్లో మరో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
పట్టణంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించనున్నారు. సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా పట్టణ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి కోరారు. మెదటి రోజు సోమవారం 14,15,16,17,18 వార్డుల్లో పర్యటించనున్నారు.
]]>