Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins mla pilot rohith reddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Fri, 03 Dec 2021 08:34:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png mla pilot rohith reddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు https://www.prajabandhu.in/mla-inaugurates-paddy-purchase-center-in-tandur/ Fri, 03 Dec 2021 08:31:13 +0000 https://www.prajabandhu.in/?p=1436 తాండూరు: రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు 24గంటల పాటు ఉచిత కరెంటు అందిస్తుందని చెప్పారు. సాగు నీరు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల కొనుగోలుపై సబ్సిడీ, రైతుబంధు, రైతుబీమా వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అన్నదాతల సంక్షేమమే తమ ధ్యేయమని, ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చే రైతులు వారి ఆధార్, బ్యాంక్ వివరాలు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రైతుల అకౌంట్ లోనే నగదు జమ చేస్తామన్నారు.

]]>
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే https://www.prajabandhu.in/mla-rohith-reddy-distributes-cmrf-cheques-2/ Fri, 03 Dec 2021 06:51:53 +0000 https://www.prajabandhu.in/?p=1421 తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి  ఆయన క్యాంపు కార్యాలయంలో  పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. నియోజకవర్గానికి చెందిన 8 మందికి రూ.9 లక్షల 80 వేల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. బషీరాబాద్‌కు చెందిన తస్లీమాబేగం రూ.1.5 లక్షలు, ఎక్మాయి గ్రామానికి చెందిన శేఖర్‌ రూ.1 లక్ష, గోటిగాకుర్ధు గ్రామానికి చెందిన రేవంత్‌ రూ.1లక్ష, కంసాన్‌పల్లికి చెందిన ఎల్లయ్యగౌడ్ రూ.55వేలు, తాండూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌ రూ.2.5 లక్షలు, చిట్టిఘనాపూర్ గ్రామానికి చెందిన మహాదేవి రూ.1లక్ష, పెద్దేముల్ మండలం అత్కూర్ తాండాకు చెందిన శోభారాణి రూ.1లక్ష, యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన చిన్నమాల రూ.1.25 లక్షల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్‌ పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుందన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా తన క్యాంపు ఆఫీసులో సంప్రదించాలని ఆయన సూచించారు.

]]>
కార్యకర్తలు పార్టీ పటిష్టతకు కృషి చేయాలి https://www.prajabandhu.in/trs-party-meeting-held-in-peddemul/ Thu, 28 Oct 2021 06:47:25 +0000 https://www.prajabandhu.in/?p=1362 తాండూరు: టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సూచించారు. బుధవారం పెద్దేముల్ మండలం కందెనెల్లి జీపీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీలో పదవులు పొంది పనిచేయని వారిని తక్షణమే తొలగిస్తామని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఉనికి కోల్పోతున్నాయని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. వరంగల్ లో నవంబర్ 15న నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయగర్జన సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

]]>
టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి https://www.prajabandhu.in/mla-rohith-reddy-attended-to-trs-plenary/ Tue, 26 Oct 2021 06:55:48 +0000 https://www.prajabandhu.in/?p=1355 తాండూరు: హైదరాబాద్ నగరంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ స్థాపించి 20ఏళ్లు పూర్తి కావడంతో అత్యంత వైభవంగా గులాబీ వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

]]>
పల్లె, పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి https://www.prajabandhu.in/mla-rohith-reddy-assembly-speech/ Thu, 07 Oct 2021 09:39:12 +0000 https://www.prajabandhu.in/?p=1342 తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. పల్లె, పట్టణ ప్రగతిపై మాట్లాడిన ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు వెల్లడించారు.

పూర్తి స్పీచ్ కోసం ఈ వీడియో చూడండి.

 

]]>
తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయాలి: అసెంబ్లీలో ఎమ్మెల్యే పైలట్‌ https://www.prajabandhu.in/mla-rohith-reddy-talks-in-assembly/ Fri, 01 Oct 2021 08:48:28 +0000 https://www.prajabandhu.in/?p=1321 తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. నియోజకవర్గం కంది పంటకు ప్రసిద్ధి అని, తాండూరు కంది పప్పుకు దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉందని రోహిత్‌ రెడ్డి సభలో తెలిపారు. కంది రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. రైతుల శ్రేయస్సు కోసం తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్‌, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఆయన విజ్ఙప్తి చేశారు. బోర్డు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు.

]]>
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-distributed-cmrf-cheques/ Tue, 14 Sep 2021 19:21:16 +0000 https://www.prajabandhu.in/?p=1269 తాండూరు: పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. సుమారు రూ. 20 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం పంపిణీ చేశారు.

నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలకు చెందిన 16 మంది లబ్ధిదారులు ఈ చెక్కులను అందుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నగదు అందిస్తున్నట్లు వివరించారు. ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా తన క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజలకు సూచించారు.

]]>
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే https://www.prajabandhu.in/mla-rohith-reddy-says-ganesh-chaturthi-wishes-to-tandur-people/ Fri, 10 Sep 2021 05:50:54 +0000 https://www.prajabandhu.in/?p=1227 తాండూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకుని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. విగ్నేశ్వరుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ సంధర్భంగా ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

]]>
నీలి విప్లవం దిశగా అడుగులు https://www.prajabandhu.in/telangana-steps-towards-blue-revolution/ Thu, 09 Sep 2021 08:01:28 +0000 https://www.prajabandhu.in/?p=1223 తాండూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోటిపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో నీలి విప్లవం మొదలైనట్లు వెల్లడించారు.

గత ఏడేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మత్స రంగంలో స్వయం సమృద్ధి, స్వావలంబనకు సంబంధించిన ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. చేప పిల్లల ఉచిత పంపిణీ ద్వారా చేపల ఉత్పత్తి పెరగడంతో పాటు లక్షలాది మంది మత్స్యకారులు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.

]]>
వేగంగా పేదల కళల సౌదాల నిర్మాణం https://www.prajabandhu.in/%e0%b0%b5%e0%b1%87%e0%b0%97%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%aa%e0%b1%87%e0%b0%a6-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%95%e0%b0%b3%e0%b0%b2-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%a6%e0%b0%be/ Fri, 20 Aug 2021 10:00:45 +0000 https://www.prajabandhu.in/?p=841 తాండూరు: తాండూరు పట్టణంలో చేపట్టిన పేద ప్రజల కళల సౌదాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మిస్తున్న గృహాలు దాదాపు 80 శాతం పనులు పూర్తి చేసుకుని తుది మెరుగులు సంతరించుకుంటున్నాయి.

తాండూరు పట్టణంలో రూ. 50 కోట్ల ఖర్చుతో 1000 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల పట్ల తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లతో తరచూ సమీక్షలు నిర‍్వహించి పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

]]>