Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins mla pilot rohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Thu, 26 Aug 2021 05:10:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png mla pilot rohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా: ఎమ్మెల్యే పైలట్‌ https://www.prajabandhu.in/will-develop-tandur-with-the-help-of-trs-govt-says-mla-pilot/ Thu, 26 Aug 2021 05:10:15 +0000 https://www.prajabandhu.in/?p=1082 తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి తాండూరు పట్టణంలో చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు పట్టణంలోని 18 వార్డుల్లో ఆయన పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. వచ్చేవారం మరో మూడు రోజుల పాటు మిగతా 18 వార్డుల్లో పర్యటన కొనసాగనుంది.

మూడు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, పూర్తి స్థాయిలో మార్పుకు కొంత సమయం పడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతుందని ఆయన అన్నారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన స్థానిక ప్రజాప్రతినిథులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

 

]]>
మూడవ రోజు కొనసాగుతున్న ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం https://www.prajabandhu.in/galli-galliki-pilot-program-successfully-going-on-third-day/ Wed, 25 Aug 2021 06:11:05 +0000 https://www.prajabandhu.in/?p=1019 తాండూరు: తాండూరు పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం మూడవ రోజైన బుధవారం కొనసాగుతోంది. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బస్తీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత క్రమంలో నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు.

తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్‌ ఏర్పాటు చేసి తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ కోసం పట్టణంలో తవ్విన గుంతలకు త్వరలోనే మరమ్మతులు చేపడతామన్నారు. పట్టణంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో భాగంగా  1, 2, 3, 4, 5, 6, 25 వార్డుల్లో ఈ రోజు పర్యటించనున్నారు.

 

]]>
అంబేడ్కర్ భవనాల మంజూరుపై దళిత నేతల హర్షం https://www.prajabandhu.in/%e0%b0%85%e0%b0%82%e0%b0%ac%e0%b1%87%e0%b0%a1%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%ad%e0%b0%b5%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%82%e0%b0%9c%e0%b1%82%e0%b0%b0%e0%b1%81%e0%b0%aa%e0%b1%88/ Mon, 23 Aug 2021 08:24:47 +0000 https://www.prajabandhu.in/?p=968 తాండూరు: తాండూరు నియోజకవర్గానికి అంబేడ్కర్ భవనాల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డికి దళిత సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం పరిధిలో రెండు భవనాలు మంజూరు కాగా.. రూ.1 కోటి వ్యయంతో తాండూరు పట్టణంలో ఒకటి, రూ.50 లక్షలతో యలాల మండల కేంద్రంలో మరో భవనాన్ని నిర్మించనున్నారు.

తమ ప్రాంతాలకు అంబేడ్కర్‌ భవనాలు మంజూరు చేయండంపై తాండూరు, యలాల మండలాలకు చెందిన దళత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిని కలిసి ఘనంగా సత్కరించారు. భవనాల నిర్మాణానికి స్థలాలు గుర్తించి వెంటనే నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

 

]]>
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచులదే https://www.prajabandhu.in/%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%89%e0%b0%82/ Mon, 23 Aug 2021 07:37:57 +0000 https://www.prajabandhu.in/?p=963 తాండూరు: బషీరాబాద్ మండలం నిళ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఆయా గ్రామాల సర్పంచులదే అని ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం సైతం చాలా అవసరమని, అందుకోసం గ్రామస్తులు ప్రజాప్రతినిథులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పిచ్చి మొక్కల నివారణ మందును ఎమ్మెల్యే పిచికారీ చేశారు.
]]>
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి: ఎమ్మెల్యే https://www.prajabandhu.in/%e0%b0%aa%e0%b1%87%e0%b0%a6%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b0%97%e0%b0%be-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/ Mon, 23 Aug 2021 07:19:30 +0000 https://www.prajabandhu.in/?p=957 తాండూరు: ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన బెంజిమెన్‌కు రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చుల భారం మోయలేని పేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరికీ సీఎం సహాయనిధి నుంచి సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.

]]>
‘గల్లి గల్లికి పైలట్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పైలట్‌ https://www.prajabandhu.in/%e0%b0%97%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%97%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%88%e0%b0%b2%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95/ Mon, 23 Aug 2021 06:44:42 +0000 https://www.prajabandhu.in/?p=951
తాండూరు: పట్టణంలో సమస్యల పరిష్కారమే థ్యేయంగా చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్‌’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. పాత తాండూరులోని కోటేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర‍్వహించిన అనంతరం ఆయన పట్టణంలో వార్డుల పర్యటనకు బయలుదేరారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని పట్టణ సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.
]]>
మహిళల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా: ఎమ్మెల్యే పైలట్‌ https://www.prajabandhu.in/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%ae%e0%b0%82-%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b5%e0%b1%83%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7/ Mon, 23 Aug 2021 05:23:19 +0000 https://www.prajabandhu.in/?p=943 తాండూరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు ప్రజలు, పలు సంఘాలకు చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డిని ఆదివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తన వద్దకు వచ్చిన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం అండతో నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఆదివారం రాఖీ పౌర్ణమి కావడంతో జిల్లా మహిళా సమైక్య మాజీ అధ్యక్షురాలు శకుంతలతో పాటు పలువురు మహిళలు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి రాఖీ కట్టి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గ మహిళల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

]]>