Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsmla rohith reddy – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteFri, 10 Dec 2021 19:26:52 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngmla rohith reddy – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232బిపిన్ రావత్ సేవలు చిరస్మరణీయం
https://www.prajabandhu.in/mla-pays-tributes-to-bipin-rawat/
Fri, 10 Dec 2021 19:26:52 +0000https://www.prajabandhu.in/?p=1476త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు అని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం బిపిన్ రావత్ చేసిన సేవలు చిరస్మరణీయం అని, భారత ప్రజలు ఆయనను ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు.
ఫాగ్గింగ్ మిషన్ల పంపిణీ..
తాండూరు పట్టణం తులసి గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని 123 గ్రామ పంచాయతీలకు మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాగ్గింగ్ మిషన్లను పంపిణీ చేశారు.
]]>
తాండూరు డిపోకు బస్సులను పెంచండి
https://www.prajabandhu.in/mla-requests-rtc-chairman-for-more-buses-to-tandur-depot/
Sat, 04 Dec 2021 05:05:52 +0000https://www.prajabandhu.in/?p=1442తాండూరు ఆర్టీసీ డిపోకు అదనపు బస్సులతో పాటు డిపోలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ను కోరారు. సమయానుకూలంగా బస్సు సర్వీసులు ఉంటేనే ప్రయాణీకులకు, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. స్పందించిన బాజిరెడ్డి ప్రభుత్వం నుంచి కొత్త బస్సులు వచ్చిన వెంటనే తాండూరు డిపోకు సైతం బస్సులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు అధికారులతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న బస్సులను సమయానుకూలంగా నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
]]>ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
https://www.prajabandhu.in/mla-rohith-reddy-says-diwali-wishes-to-tandur-people/
Thu, 04 Nov 2021 09:11:07 +0000https://www.prajabandhu.in/?p=1372దీపావళి పర్వదినం సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. చిన్న పిల్లలు టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
]]>తాండూరులో మంత్రి సబితారెడ్డి పర్యటన
https://www.prajabandhu.in/minister-sabitareddy-inaugurates-development-works-in-tandur/
Sun, 31 Oct 2021 06:20:45 +0000https://www.prajabandhu.in/?p=1367తాండూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. రూ.26.50 కోట్లతో తాండూరు పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ఆమెశనివారం ప్రారంభించారు. రూ.20 కోట్లతో నిర్మించిన మాతాశిశు ఆస్పత్రి, రూ .2.25 కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల భవనం, తాండూరులో రూ.3.47 కోట్లతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. పారిశుధ్యం మెరుగుపరచడానికి గాను నూతనంగా తాండూరు మున్సిపాలిటీకి మంజూరైన 18 ట్రాలీ ఆటోలను ప్రారంభించారు. సాయిపూర్ 9వ వార్డులో రూ.20 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్తాపన చేశారు. అనంతరం 165 మంది లబ్ధిదారులకు రూ.1.65 కోట్లు విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. తాండూరులో 100 పడకల ఆస్పత్రిని చూడగానే ఇంద్రారెడ్డి గుర్తుకువచ్చారన్నారు. పాతికేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తాండూరుకు వంద పడకల ఆస్పత్రి తెస్తానని ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన కల సాకారం కావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకురావడం ఒకటి మిగిలి ఉందని, భవిష్యత్తులో అది కూడా నెరవేరుతుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైతం లేని సమయంలో ఐదు కాలేజీలు మంజూరు చేయించానని ఆమె వెల్లడించారు.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న కాలంలో తాండూరు నియోజకవర్గాన్ని సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తాండూరు అభివృద్ధిలో మంత్రి సబితారెడ్డి పాత్ర చాలా గొప్పదని, సీఎం కేసీఆర్ సహాకారంతో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.
]]>ప్రజలు సంతోషంగా శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలి
https://www.prajabandhu.in/mla-rohith-reddy-visits-ammavari-temple-in-tandur/
Sun, 10 Oct 2021 08:54:38 +0000https://www.prajabandhu.in/?p=1344తాండూరు: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం తాండూరు పట్టణం బస్వన్న కట్టవద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి గెలిచిన శుభ సందర్భంగా దసరా పండుగ జరుపుకుంటామని తెలిపారు. దుష్ట శక్తుల నుంచి కనకదుర్గమ్మ తల్లి ప్రజలను కాపాడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు కానుకలు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రజలంతా సంతోషంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.
ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా..
నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. కోత్లాపూర్లోని రేణుక ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ్యులచేత ప్రమాణస్వీకారం చేయించి వారికి అభినందనలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత..
తాండూరు పట్టణానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు రూ.4 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం పంపిణీ చేశారు. షేక్ అబ్దుల్లాకు రూ.3 లక్షలు, నీతాకు రూ.1 లక్ష విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
]]>బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ఎమెల్యే రోహిత్ రెడ్డి
https://www.prajabandhu.in/mla-rohithreddy-distributes-batukamma-kanuka/
Sat, 02 Oct 2021 09:03:58 +0000https://www.prajabandhu.in/?p=1323తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శనివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాలాల మండలం పగిడ్యాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం చీరలను కానుకగా అందిస్తుందని తెలిపారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ సర్కార్ పనిచేస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.
పండుగలను ఆనందంగా జరుపుకునేందుకు చీరలు పంపిణీ చేస్తున్నామని, నియోజకవర్గంలో 92,200 మంది లబ్ధిదారులకు బతుకమ్మ కానుక అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
మహాత్మా గాంధీకి నివాళులు..
నేడు గాంధీ జయంతి సందర్భంగా తాండూరు పట్టణం గాంధీచౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శం అని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలన్నారు. గాంధీ ఆశయాలు నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ పల్లెప్రగతి పేరుతో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.
]]>శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
https://www.prajabandhu.in/mla-rohithreddy-visits-tirumala/
Sun, 26 Sep 2021 10:31:04 +0000https://www.prajabandhu.in/?p=1311తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
]]>పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తుంది
https://www.prajabandhu.in/mla-rohith-reddy-distributes-cmrf-cheques/
Thu, 16 Sep 2021 10:06:02 +0000https://www.prajabandhu.in/?p=1279తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పలువురు లబ్ధిదారులకు ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. తాండూరు పట్టణం మోమిన్‌గల్లికి చెందిన సుధాకర్ రూ.1 లక్ష, బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామానికి చెందిన చిన్నభీమప్ప రూ.1.25 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి అందిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనారోగ్యంతో బాధపడుత్ను పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తుందన్నారు.
]]>వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-inaugurates-covid-vaccination-special-drive/
Thu, 16 Sep 2021 09:42:39 +0000https://www.prajabandhu.in/?p=1273తాండూరు: నియోజకవర్గం పరిధిలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధికారులకు సూచించారు. తాండూరు పట్టణంలోని సాయిపూర్, రాజీవ్‌కాలనీతో పాటు యాలాల మండలం అన్నాసాగర్ గ్రామంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
అంగన్‌వాడీ సిబ్బంది, ఆశావర్కర్లు ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.
]]>అద్భుత ఘట్టానికి వేదికైన వికారాబాద్
https://www.prajabandhu.in/medicin-from-the-sky-project-launched-in-vikarabad/
Mon, 13 Sep 2021 09:34:20 +0000https://www.prajabandhu.in/?p=1234తెలంగాణ రాష్ట్రం మరోసారి చరిత్ర సృష్టించింది. దేశంలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఈ అద్భుత ఘట్టానికి వికారాబాద్ పట్టణం వేదికైంది. మారుమూల ప్రాంతాలకు సైతం మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టును వికారాబాద్‌లో కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు
రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ఆధ్వర్యంలో ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీని అమలు కోసం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, నీతి ఆయోగ్, హెల్త్‌నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి ఐటీ శాఖ పనిచేస్తుంది