Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsmla rohithreddy – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteFri, 03 Dec 2021 08:04:15 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngmla rohithreddy – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎమ్మెల్యే పరామర్శ
https://www.prajabandhu.in/mla-rohith-reddy-visits-tandur-district-hospital/
Fri, 03 Dec 2021 07:58:52 +0000https://www.prajabandhu.in/?p=1430తాండూరు: కలుషిత నీరు తాగడంతో అనారోగ్యానికి గురై తాండూరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాత తాండూరుకు చెందిన బాధితులను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురువారం పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశించారు.
తాగు నీరు కలుషితం అయిన నేపథ్యంలో ఎమ్మెల్యే పట్టణంలో పర్యటించారు. పైపు లైన్ లీకేజీలే నీటి కాలుష్యానికి కారణమని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
]]>
సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే పైలట్
https://www.prajabandhu.in/mla-rohithreddy-meets-cm-kcr/
Sat, 25 Sep 2021 07:59:27 +0000https://www.prajabandhu.in/?p=1308తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది.
]]>తాండూరును ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
https://www.prajabandhu.in/will-try-to-make-tandur-as-top-muncipality-says-mla-pilot-rohith-reddy/
Wed, 01 Sep 2021 07:10:01 +0000https://www.prajabandhu.in/?p=1212తాండూరు: తాండూరు మున్సిపాలిటీని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో నిర్వహించిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజలు తన పర్యటనలో పాల్గొని వారి సమస్యలు వివరించినట్లు తెలిపారు. ఐదు రోజుల పర్యటలో 790 సమస్యలను గర్తించామన్నారు.
శానిటేషన్, వీధి దీపాలు, కల్వర్టులు, సీసీ రోడ్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. గుర్తించిన ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన చాలా సమస్యలను అధికారుల సాయంతో తక్షణమే పరిష్కరించామని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, పార్టీలకతీతంగా స్థానిక నేతలు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తాండూరు అభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.
త్వరలోనే మంత్రి కేటీఆర్ తాండూరులో పర్యటించనున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యే అయిన మొదటి సంవత్సరం ఎన్నికలతోనే కాలం గడిచిందని.. రెండవ ఏడాది కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిందన్నారు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో పూర్తిగా అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో సైతం దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.
]]>ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే
https://www.prajabandhu.in/ct-scan-unit-starts-in-tandur-district-hospital/
Wed, 25 Aug 2021 08:00:20 +0000https://www.prajabandhu.in/?p=1029తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తామని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్ పర్సన్ సునీతారెడ్డి అన్నారు. రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్ యూనిట్‌ను స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆస్పత్రిలో గత మూడేళ్లుగా సీటీ స్కాన్ సేవలు నిలిచిపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక సరిహద్దులో ఉన్న తాండూరు ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం విమానాల తయారీ సంస్థ బోయింగ్ సీటీ స్కానింగ్ యంత్రాన్ని అందించడం సంతోషకరమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యానికి తాను అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
]]>రెండవ రోజు కొనసాగుతోన్న ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం
https://www.prajabandhu.in/galli-galliki-pilot-program-successfully-going-on-second-day/
Tue, 24 Aug 2021 05:57:08 +0000https://www.prajabandhu.in/?p=987తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారమే థ్యేయంగా తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం రెండవ రోజు కొనసాగుతోంది. పట్టణంలోని 20వ వార్డు నుంచి రెండవ రోజు పర్యటన ప్రారంభించారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు, యువత నుంచి విశేష స్పందన వస్తోంది.
పట్టణంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు హైదరాబాద్ రోడ్డులోని జిపిఆర్ గార్డెన్స్ సమీపంలో జిల్లా కలెక్టర్ పౌసమి బసుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావి తరాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
]]>ప్రత్యర్థులపై మండిపడిన తాండూరు ఎమ్మెల్యే పైలట్
https://www.prajabandhu.in/cant-tolerate-if-any-one-try-to-stop-tandur-people-development-says-mla-pilot/
Mon, 23 Aug 2021 11:06:46 +0000https://www.prajabandhu.in/?p=976ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తాను కృషి చేస్తుంటే కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. వారు ఎంతటి వారైనా సరే సహించేది లేదని తన ప్రత్యర్థులను ఉద్దేశించి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాండూరు పట్టణంలో చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమంలో సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
]]>ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే
https://www.prajabandhu.in/ready-to-fight-with-any-one-for-tandur-people-welfare-says-mla-pilot/
Mon, 23 Aug 2021 09:24:59 +0000https://www.prajabandhu.in/?p=971తాండూరు: గల్లి గల్లికి పైలట్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాత తాండూరు పరిధిలోని 14, 15, 16, 17, 18 వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల గురించి స్వయంగా ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని.. ఇది ప్రజలపై వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేసే ఏ కార్యక్రమానికైనా సరే ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా సరే సహించేది లేదన్నారు. వార్డుల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అవసరమైన నిధుల మంజూరు కోసం మంత్రి కేటీఆర్‌ను కోరనున్నట్లు తెలిపారు.
తాను ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పాత తాండూరులో అర్బన్ హాస్పిటల్ మంజూరు చేయించినట్లు తెలిపారు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు సరిగ్గా లేనందునే ఆలస్యం అయ్యిందని, త్వరలోనే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.