Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins peddemul – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Thu, 28 Oct 2021 06:47:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png peddemul – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 కార్యకర్తలు పార్టీ పటిష్టతకు కృషి చేయాలి https://www.prajabandhu.in/trs-party-meeting-held-in-peddemul/ Thu, 28 Oct 2021 06:47:25 +0000 https://www.prajabandhu.in/?p=1362 తాండూరు: టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సూచించారు. బుధవారం పెద్దేముల్ మండలం కందెనెల్లి జీపీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీలో పదవులు పొంది పనిచేయని వారిని తక్షణమే తొలగిస్తామని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఉనికి కోల్పోతున్నాయని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. వరంగల్ లో నవంబర్ 15న నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయగర్జన సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

]]>
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే https://www.prajabandhu.in/mla-starts-development-works-in-kandenelli/ Sun, 03 Oct 2021 05:53:31 +0000 https://www.prajabandhu.in/?p=1329 తాండూరు: పెద్దేముల్ మండలం కందెనెల్లి గ్రామంలో డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మరి తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో తాండూరును ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు.

]]>
మండల అధ్యక్షులను ప్రకటించిన టీఆర్ఎస్ https://www.prajabandhu.in/trs-announced-mandal-presidents/ Tue, 14 Sep 2021 11:53:24 +0000 https://www.prajabandhu.in/?p=1265 తాండూరు: తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. తాండూరు పట్టణ అధ్యక్షుడిగా నయ్యుం అఫ్ఫు, తాండూరు మండల అధ్యక్షుడిగా రాందాస్, యాలాల మండలానికి మల్లారెడ్డి, పెద్దేముల్ మండలానికి కొహిర్ శ్రీనివాస్, బాషీరాబాద్ మండలానికి రామునాయక్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి జహంగీర్ పాషా సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుల పేర్లు వెల్లడించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కమిటీలు పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో దేశంలోనే అత్యంత వేగంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

]]>
వీఆర్ఓలకు న్యాయం చేయాలి https://www.prajabandhu.in/vros-demanding-government-for-justice/ Wed, 08 Sep 2021 08:28:43 +0000 https://www.prajabandhu.in/?p=1220 తాండూరు: ప్రస్తుత హోదాకు సమానంగా రెవెన్యూ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని పలువురు వీఆర్ఓలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వీఆర్ఓలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమను మాతృశాఖలోనే కొనసాగించి అర్హత ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. అనంతరం తహసీల్దార్ ఫయీమ్ ఖాద్రీకి వినతిపత్రం అందజేశారు.

]]>
అంబురామేశ్వర ఆలయం జాతరలో కొబ్బరికాయల విక్రయానికి వేలం https://www.prajabandhu.in/auction-will-conduct-for-coconut-sale-in-amburameswra-temple/ Sat, 28 Aug 2021 06:47:58 +0000 https://www.prajabandhu.in/?p=1138 తాండూరు: శ్రావణమాసం చివరి సోమవారం పురస్కరించుకొని పెద్దేముల్ మండలం తట్టిపల్లి శివారులో ఉన్న అంబురామేశ్వర ఆలయం జాతరలో కొబ్బరికాయలు అమ్ముకునేందుకు, పార్కింగ్ కోసం వేలం వేయనున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ఈనెల 30న ఉదయం 10 గంటల లోపు ఆలయానికి రావాలన్నారు.

వేలంలో పాల్గొనేవారు ముందుగా రూ.1000లు అడ్వాన్స్‌గా చెల్లించాలన్నారు. టెండర్ దక్కించుకున్న వారు వెంటనే 50 శాతం డబ్బులు చెల్లించాలని.. మిగతా 50 శాతం జాతర పూర్తయిన తరువాత చెల్లించవచ్చని తెలిపారు.

]]>
విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు మెమోల జారీకి ఆదేశాలు https://www.prajabandhu.in/deo-oreder-to-give-memos-for-absented-teachers/ Sat, 28 Aug 2021 06:30:20 +0000 https://www.prajabandhu.in/?p=1135 తాండూరు: పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేస్తుంటే ఉపాధ్యాయుల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఈ నెల 26 నుంచి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సహా టీచర్లందరూ తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను కొంతమంది ఉపాధ్యాయులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. శుక్రవారం సీఈఓ జానకీరెడ్డి పెద్దేముల్ మండలం కందనెల్లి ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం, ఉపాధ్యాయురాలు.. ఉన్నత పాఠశాలలో హెచ్ఎం, మరో నలుగురు ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టారు. విధులకు గైర్హాజరైన వారందరికీ మెమోలు జారీ చేయాలని డీఈఓ రేణుకదేవి ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత పాఠశాలలో 13 మంది ఉపాధ్యాయులకు ఐదుగురు, ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈఓ తెలిపారు.

]]>
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి: ఎమ్మెల్యే https://www.prajabandhu.in/%e0%b0%aa%e0%b1%87%e0%b0%a6%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b0%97%e0%b0%be-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/ Mon, 23 Aug 2021 07:19:30 +0000 https://www.prajabandhu.in/?p=957 తాండూరు: ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన బెంజిమెన్‌కు రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చుల భారం మోయలేని పేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరికీ సీఎం సహాయనిధి నుంచి సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.

]]>
రైతులు సాగు వివరాలు నమోదు చేసుకోవాలి https://www.prajabandhu.in/%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b1%81-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a6/ Wed, 18 Aug 2021 07:10:16 +0000 https://www.prajabandhu.in/?p=807 తాండూరు: పెద్దేముల్‌ మండలంలోని రైతులు తమ పొలాల్లో సాగుచేసిన పంటల వివరాలు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నజీరుద్దిన్‌ సూచించారు. మండల పరిధిలోని గిర్మాపూర్‌, గోట్లపల్లి, ఇందూరు గ్రామాల్లో ఆయన మంగళవారం పర్యటించి పలు రకాల పంటలను పరిశీలించారు. రైతులు సాగు చేస్తున్న అన్ని పంటల వివరాలను వ్యవసాయ అధికారులకు అందించాలని నజీరుద్దిన్‌ కోరారు.

సాగు వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా పంట అమ్ముకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన చెప్పారు. సాగు విషయంలో రైతులకు ఎలాంటి సందేహాలున్నా అధికారులను సంప్రదించాలని సూచించారు.

]]>
కొత్తగా పాసుబుక్ పొందిన వారు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు https://www.prajabandhu.in/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%97%e0%b0%be-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b8%e0%b1%81%e0%b0%ac%e0%b1%81%e0%b0%95%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a8/ Tue, 17 Aug 2021 06:25:10 +0000 https://www.prajabandhu.in/?p=762 పెద్దేముల్: రెవెన్యూ అధికారుల నుంచి కొత్తగా పట్టాదారు పాసుబుక్ పొందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని పెద్దేముల్ మండల వ్యవసాయ అధికారి నజీరొద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 3వ తేదీ లోపు భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఉండాలని.. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు రైతుబీమాకు అర్హులని ప్రకటనలో పేర్కొన్నారు.

బీమాకు దరఖాస్తు చేసుకునేవారు పొలం పట్టా పాసుబుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్‌కార్డు జిరాక్సు కాపీలను దరఖాస్తు ఫారంకు జతచేసి సంబంధిత వ్యవసాయ అధికారులకు అందించాలని సూచించారు. మండల పరిధిలోని ‍గ్రామాల్లో మంగళవారం నుంచి పంటల వివరాలు సేకరిస్తామని నజీరొద్దీన్ తెలిపారు.

]]>
కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి https://www.prajabandhu.in/%e0%b0%95%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a8%e0%b0%be-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d/ Mon, 16 Aug 2021 05:37:02 +0000 https://www.prajabandhu.in/?p=727 పెద్దేముల్‌: కరోనా భారి నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని డీఎంహెచ్ఓ సుధాకర్ షిండే అన్నారు. పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల పట్ల నిబద్ధతో వ్యవహరించాలని, ‍ప్రతి ఒక్కరూ విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్రస్తుతం సురక్షింతగా ఉంటున్నట్లు డీఎంహెచ్ఓ సుధాకర్ తెలిపారు. కరోనా మహమ్మారి నియంత్రణకు టీకాలే మార్గమని, త్వరలో మొదటి డోస్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. వాక్సిన్‌ తీసుకున్నవారు సైతం ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాక్సిన్‌తో రోగనిరోధక శక్తి పెరిగి కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సామర్ధ్యం లభిస్తుందని తెలియజేశారు.

]]>