Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginspilot rohith reddy – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteSat, 21 Aug 2021 10:52:46 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngpilot rohith reddy – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే
https://www.prajabandhu.in/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%a4%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d/
Mon, 16 Aug 2021 07:23:23 +0000https://www.prajabandhu.in/?p=742తాండూరు: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితమే ప్రస్తుతం మనం స్వేచ్చగా బతకడానికి కారణమన్నారు.
మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, నేతాజీ, శివాజీ లాంటి మహనీయులను మనం ఎప్పటికీ మరచిపోలేమని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని పాఠశాలలతో పాటు పలు కూడళ్లలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
]]>
నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
https://www.prajabandhu.in/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b%e0%b0%9c%e0%b0%95%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97-%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b5%e0%b1%83%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%95/
Mon, 16 Aug 2021 06:36:38 +0000https://www.prajabandhu.in/?p=738తాండూరు: నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గనిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సహకారంతో నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకువచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కరోనా సంక్షోభంలో సైతం దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.