Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginstandur – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteMon, 06 Dec 2021 20:14:55 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngtandur – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
https://www.prajabandhu.in/mla-rohith-reddy-visits-tandur-gurukul-school/
Mon, 06 Dec 2021 20:14:55 +0000https://www.prajabandhu.in/?p=1461తాండూరు పట్టణంలోని ఖంజాపూర్ గేట్ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి ఉపాధ్యాయులను, విద్యార్థులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సహకారంతో విద్యార్థులకు కావాల్సిన మౌలికవసతులను కల్పిస్తామన్నారు.
పాఠశాల బయట విద్యుత్ దీపాలు లేవని విద్యార్థులు ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే అక్కడ లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జాతీయస్థాయిలో రాణించిన ఇద్దరు విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించి సన్మానించారు.
]]>
మూడు నెలల్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు
https://www.prajabandhu.in/double-bed-room-houses-gives-to-benificiaries-soonly-says-mla-pilot/
Mon, 06 Dec 2021 19:48:45 +0000https://www.prajabandhu.in/?p=1458తాండూరు: పట్టణంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఖంజాపూర్ గేట్ సమీపంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేదవాడు రెండు పడకల ఇంటిలో సకల సౌకర్యాలతో బతకాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత ఆశయం మేరకే ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
త్వరలోనే అర్హులకు ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మరో మూడు నెలల్లోనే పేదల కల నెరవేరబోతుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
]]>కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు
https://www.prajabandhu.in/mla-inaugurates-paddy-purchase-center-in-tandur/
Fri, 03 Dec 2021 08:31:13 +0000https://www.prajabandhu.in/?p=1436తాండూరు: రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు 24గంటల పాటు ఉచిత కరెంటు అందిస్తుందని చెప్పారు. సాగు నీరు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల కొనుగోలుపై సబ్సిడీ, రైతుబంధు, రైతుబీమా వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అన్నదాతల సంక్షేమమే తమ ధ్యేయమని, ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చే రైతులు వారి ఆధార్, బ్యాంక్ వివరాలు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రైతుల అకౌంట్ లోనే నగదు జమ చేస్తామన్నారు.
]]>ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎమ్మెల్యే పరామర్శ
https://www.prajabandhu.in/mla-rohith-reddy-visits-tandur-district-hospital/
Fri, 03 Dec 2021 07:58:52 +0000https://www.prajabandhu.in/?p=1430తాండూరు: కలుషిత నీరు తాగడంతో అనారోగ్యానికి గురై తాండూరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాత తాండూరుకు చెందిన బాధితులను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురువారం పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశించారు.
తాగు నీరు కలుషితం అయిన నేపథ్యంలో ఎమ్మెల్యే పట్టణంలో పర్యటించారు. పైపు లైన్ లీకేజీలే నీటి కాలుష్యానికి కారణమని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
]]>ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
https://www.prajabandhu.in/mla-rohith-reddy-distributes-cmrf-cheques-2/
Fri, 03 Dec 2021 06:51:53 +0000https://www.prajabandhu.in/?p=1421తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. నియోజకవర్గానికి చెందిన 8 మందికి రూ.9 లక్షల 80 వేల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. బషీరాబాద్‌కు చెందిన తస్లీమాబేగం రూ.1.5 లక్షలు, ఎక్మాయి గ్రామానికి చెందిన శేఖర్ రూ.1 లక్ష, గోటిగాకుర్ధు గ్రామానికి చెందిన రేవంత్ రూ.1లక్ష, కంసాన్‌పల్లికి చెందిన ఎల్లయ్యగౌడ్ రూ.55వేలు, తాండూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ రూ.2.5 లక్షలు, చిట్టిఘనాపూర్ గ్రామానికి చెందిన మహాదేవి రూ.1లక్ష, పెద్దేముల్ మండలం అత్కూర్ తాండాకు చెందిన శోభారాణి రూ.1లక్ష, యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన చిన్నమాల రూ.1.25 లక్షల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్ పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుందన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా తన క్యాంపు ఆఫీసులో సంప్రదించాలని ఆయన సూచించారు.
]]>ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
https://www.prajabandhu.in/mla-rohith-reddy-says-diwali-wishes-to-tandur-people/
Thu, 04 Nov 2021 09:11:07 +0000https://www.prajabandhu.in/?p=1372దీపావళి పర్వదినం సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. చిన్న పిల్లలు టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
]]>తాండూరులో మంత్రి సబితారెడ్డి పర్యటన
https://www.prajabandhu.in/minister-sabitareddy-inaugurates-development-works-in-tandur/
Sun, 31 Oct 2021 06:20:45 +0000https://www.prajabandhu.in/?p=1367తాండూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. రూ.26.50 కోట్లతో తాండూరు పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ఆమెశనివారం ప్రారంభించారు. రూ.20 కోట్లతో నిర్మించిన మాతాశిశు ఆస్పత్రి, రూ .2.25 కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల భవనం, తాండూరులో రూ.3.47 కోట్లతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. పారిశుధ్యం మెరుగుపరచడానికి గాను నూతనంగా తాండూరు మున్సిపాలిటీకి మంజూరైన 18 ట్రాలీ ఆటోలను ప్రారంభించారు. సాయిపూర్ 9వ వార్డులో రూ.20 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్తాపన చేశారు. అనంతరం 165 మంది లబ్ధిదారులకు రూ.1.65 కోట్లు విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. తాండూరులో 100 పడకల ఆస్పత్రిని చూడగానే ఇంద్రారెడ్డి గుర్తుకువచ్చారన్నారు. పాతికేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తాండూరుకు వంద పడకల ఆస్పత్రి తెస్తానని ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన కల సాకారం కావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకురావడం ఒకటి మిగిలి ఉందని, భవిష్యత్తులో అది కూడా నెరవేరుతుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైతం లేని సమయంలో ఐదు కాలేజీలు మంజూరు చేయించానని ఆమె వెల్లడించారు.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న కాలంలో తాండూరు నియోజకవర్గాన్ని సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తాండూరు అభివృద్ధిలో మంత్రి సబితారెడ్డి పాత్ర చాలా గొప్పదని, సీఎం కేసీఆర్ సహాకారంతో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.
]]>ప్రజలు సంతోషంగా శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలి
https://www.prajabandhu.in/mla-rohith-reddy-visits-ammavari-temple-in-tandur/
Sun, 10 Oct 2021 08:54:38 +0000https://www.prajabandhu.in/?p=1344తాండూరు: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం తాండూరు పట్టణం బస్వన్న కట్టవద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి గెలిచిన శుభ సందర్భంగా దసరా పండుగ జరుపుకుంటామని తెలిపారు. దుష్ట శక్తుల నుంచి కనకదుర్గమ్మ తల్లి ప్రజలను కాపాడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు కానుకలు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రజలంతా సంతోషంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.
ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా..
నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. కోత్లాపూర్లోని రేణుక ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ్యులచేత ప్రమాణస్వీకారం చేయించి వారికి అభినందనలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత..
తాండూరు పట్టణానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు రూ.4 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం పంపిణీ చేశారు. షేక్ అబ్దుల్లాకు రూ.3 లక్షలు, నీతాకు రూ.1 లక్ష విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
]]>కరాటే పోటీల్లో సత్తా చాటిన తాండూరు విద్యార్థులు
https://www.prajabandhu.in/tandur-students-won-gold-and-silver-medals-in-karate-championship/
Tue, 05 Oct 2021 06:02:36 +0000https://www.prajabandhu.in/?p=1337తాండూరు: తాండూరు విద్యార్థులు కరాటే పోటీల్లో సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో సోమవారం నిర్వహించిన 7వ నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. ఐదు గోల్డ్ మెడల్స్, పది సిల్వర్ మెడల్స్ సాధించి ప్రశంసలు అందుకున్నారు.
కరాటే కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే కాదని, శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉంటుందని కరాటే మాస్టర్ బీవీ సాయి పేర్కొన్నారు. హర్షిత, సుధీర్, కార్తీక్, అనన్య, సాయి గోల్డ్ మెడల్స్ సాధించగా మరో పది మంది సిల్వర్ మెడల్స్ సాధించినట్లు ఆయన వెల్లడించాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతానన్నారు.
]]>తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయాలి: అసెంబ్లీలో ఎమ్మెల్యే పైలట్
https://www.prajabandhu.in/mla-rohith-reddy-talks-in-assembly/
Fri, 01 Oct 2021 08:48:28 +0000https://www.prajabandhu.in/?p=1321తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. నియోజకవర్గం కంది పంటకు ప్రసిద్ధి అని, తాండూరు కంది పప్పుకు దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉందని రోహిత్ రెడ్డి సభలో తెలిపారు. కంది రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. రైతుల శ్రేయస్సు కోసం తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఆయన విజ్ఙప్తి చేశారు. బోర్డు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు.
]]>