Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins trs – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Sun, 31 Oct 2021 06:20:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png trs – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 తాండూరులో మంత్రి సబితారెడ్డి పర్యటన https://www.prajabandhu.in/minister-sabitareddy-inaugurates-development-works-in-tandur/ Sun, 31 Oct 2021 06:20:45 +0000 https://www.prajabandhu.in/?p=1367 తాండూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. రూ.26.50 కోట్లతో తాండూరు పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. రూ.20 కోట్లతో నిర్మించిన మాతాశిశు ఆస్పత్రి, రూ .2.25 కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల భవనం, తాండూరులో రూ.3.47 కోట్లతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. పారిశుధ్యం మెరుగుపరచడానికి గాను నూతనంగా తాండూరు మున్సిపాలిటీకి మంజూరైన 18 ట్రాలీ ఆటోలను ప్రారంభించారు. సాయిపూర్ 9వ వార్డులో రూ.20 లక్షలతో నిర్మించనున్న  అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్తాపన చేశారు. అనంతరం 165 మంది లబ్ధిదారులకు రూ.1.65 కోట్లు విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. తాండూరులో 100 పడకల ఆస్పత్రిని చూడగానే ఇంద్రారెడ్డి గుర్తుకువచ్చారన్నారు. పాతికేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తాండూరుకు వంద పడకల ఆస్పత్రి తెస్తానని ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన కల సాకారం కావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకురావడం ఒకటి మిగిలి ఉందని, భవిష్యత్తులో అది కూడా నెరవేరుతుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైతం లేని సమయంలో ఐదు కాలేజీలు మంజూరు చేయించానని ఆమె వెల్లడించారు.

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న కాలంలో తాండూరు నియోజకవర్గాన్ని సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తాండూరు అభివృద్ధిలో మంత్రి సబితారెడ్డి పాత్ర చాలా గొప్పదని, సీఎం కేసీఆర్ సహాకారంతో  నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.

]]>
కార్యకర్తలు పార్టీ పటిష్టతకు కృషి చేయాలి https://www.prajabandhu.in/trs-party-meeting-held-in-peddemul/ Thu, 28 Oct 2021 06:47:25 +0000 https://www.prajabandhu.in/?p=1362 తాండూరు: టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సూచించారు. బుధవారం పెద్దేముల్ మండలం కందెనెల్లి జీపీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీలో పదవులు పొంది పనిచేయని వారిని తక్షణమే తొలగిస్తామని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఉనికి కోల్పోతున్నాయని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. వరంగల్ లో నవంబర్ 15న నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయగర్జన సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

]]>
టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి https://www.prajabandhu.in/mla-rohith-reddy-attended-to-trs-plenary/ Tue, 26 Oct 2021 06:55:48 +0000 https://www.prajabandhu.in/?p=1355 తాండూరు: హైదరాబాద్ నగరంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ స్థాపించి 20ఏళ్లు పూర్తి కావడంతో అత్యంత వైభవంగా గులాబీ వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

]]>
మండల అధ్యక్షులను ప్రకటించిన టీఆర్ఎస్ https://www.prajabandhu.in/trs-announced-mandal-presidents/ Tue, 14 Sep 2021 11:53:24 +0000 https://www.prajabandhu.in/?p=1265 తాండూరు: తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. తాండూరు పట్టణ అధ్యక్షుడిగా నయ్యుం అఫ్ఫు, తాండూరు మండల అధ్యక్షుడిగా రాందాస్, యాలాల మండలానికి మల్లారెడ్డి, పెద్దేముల్ మండలానికి కొహిర్ శ్రీనివాస్, బాషీరాబాద్ మండలానికి రామునాయక్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి జహంగీర్ పాషా సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుల పేర్లు వెల్లడించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కమిటీలు పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో దేశంలోనే అత్యంత వేగంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

]]>
నీలి విప్లవం దిశగా అడుగులు https://www.prajabandhu.in/telangana-steps-towards-blue-revolution/ Thu, 09 Sep 2021 08:01:28 +0000 https://www.prajabandhu.in/?p=1223 తాండూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోటిపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో నీలి విప్లవం మొదలైనట్లు వెల్లడించారు.

గత ఏడేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మత్స రంగంలో స్వయం సమృద్ధి, స్వావలంబనకు సంబంధించిన ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. చేప పిల్లల ఉచిత పంపిణీ ద్వారా చేపల ఉత్పత్తి పెరగడంతో పాటు లక్షలాది మంది మత్స్యకారులు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.

]]>
నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా: ఎమ్మెల్యే పైలట్‌ https://www.prajabandhu.in/will-develop-tandur-with-the-help-of-trs-govt-says-mla-pilot/ Thu, 26 Aug 2021 05:10:15 +0000 https://www.prajabandhu.in/?p=1082 తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి తాండూరు పట్టణంలో చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు పట్టణంలోని 18 వార్డుల్లో ఆయన పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. వచ్చేవారం మరో మూడు రోజుల పాటు మిగతా 18 వార్డుల్లో పర్యటన కొనసాగనుంది.

మూడు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, పూర్తి స్థాయిలో మార్పుకు కొంత సమయం పడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతుందని ఆయన అన్నారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన స్థానిక ప్రజాప్రతినిథులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

 

]]>
పార్టీలకతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే https://www.prajabandhu.in/solve-peoples-problems-non-partisan-mla/ Mon, 16 Aug 2021 10:50:25 +0000 https://www.prajabandhu.in/?p=752 తాండూరు: తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన పలువురు ప్రజలతో ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమావేశం అయ్యారు. పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.

ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ సహకారంతో ప్రతీ గ్రామాన్ని సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

]]>
తాండూరు మండలంలో నేడు ఎమ్మెల్యే పర్యటన https://www.prajabandhu.in/%e0%b0%a4%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%81-%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d/ Fri, 06 Aug 2021 06:25:27 +0000 https://www.prajabandhu.in/?p=616 తాండూరు: మండలంలోని పర్వతాపూర్, చింతమనిపట్నం గ్రామాల్లో నేడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్బంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలిపారు. ప్రభుత్వం అండతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.

]]>
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే https://www.prajabandhu.in/%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa/ Tue, 03 Aug 2021 07:22:34 +0000 https://www.prajabandhu.in/?p=562 తాండూరు: మండల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలకు వరమని చెప్పారు. పేద ప్రజల అభివృద్ది, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

]]>