Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsts schools – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteWed, 01 Sep 2021 08:41:41 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngts schools – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232బుధవారం నుంచి విద్యార్థులకు బస్ పాసులు జారీ
https://www.prajabandhu.in/students-bus-passes-issueing-from-today-says-tandur-depo-manager/
Wed, 01 Sep 2021 08:41:41 +0000https://www.prajabandhu.in/?p=1217తాండూరు: బుధవారం నుంచి విద్యార్థులకు బస్ పాసులు జారీ చేయనున్నట్లు తాండూరు బస్ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల పాసులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు ప్రారంభిస్తుండటంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
]]>
విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు మెమోల జారీకి ఆదేశాలు
https://www.prajabandhu.in/deo-oreder-to-give-memos-for-absented-teachers/
Sat, 28 Aug 2021 06:30:20 +0000https://www.prajabandhu.in/?p=1135తాండూరు: పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేస్తుంటే ఉపాధ్యాయుల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఈ నెల 26 నుంచి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సహా టీచర్లందరూ తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను కొంతమంది ఉపాధ్యాయులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. శుక్రవారం సీఈఓ జానకీరెడ్డి పెద్దేముల్ మండలం కందనెల్లి ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం, ఉపాధ్యాయురాలు.. ఉన్నత పాఠశాలలో హెచ్ఎం, మరో నలుగురు ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టారు. విధులకు గైర్హాజరైన వారందరికీ మెమోలు జారీ చేయాలని డీఈఓ రేణుకదేవి ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత పాఠశాలలో 13 మంది ఉపాధ్యాయులకు ఐదుగురు, ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈఓ తెలిపారు.