Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsyalal – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteSat, 02 Oct 2021 09:03:58 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngyalal – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ఎమెల్యే రోహిత్ రెడ్డి
https://www.prajabandhu.in/mla-rohithreddy-distributes-batukamma-kanuka/
Sat, 02 Oct 2021 09:03:58 +0000https://www.prajabandhu.in/?p=1323తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శనివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాలాల మండలం పగిడ్యాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం చీరలను కానుకగా అందిస్తుందని తెలిపారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ సర్కార్ పనిచేస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.
పండుగలను ఆనందంగా జరుపుకునేందుకు చీరలు పంపిణీ చేస్తున్నామని, నియోజకవర్గంలో 92,200 మంది లబ్ధిదారులకు బతుకమ్మ కానుక అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
మహాత్మా గాంధీకి నివాళులు..
నేడు గాంధీ జయంతి సందర్భంగా తాండూరు పట్టణం గాంధీచౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శం అని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలన్నారు. గాంధీ ఆశయాలు నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ పల్లెప్రగతి పేరుతో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.
]]>
వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-inaugurates-covid-vaccination-special-drive/
Thu, 16 Sep 2021 09:42:39 +0000https://www.prajabandhu.in/?p=1273తాండూరు: నియోజకవర్గం పరిధిలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధికారులకు సూచించారు. తాండూరు పట్టణంలోని సాయిపూర్, రాజీవ్‌కాలనీతో పాటు యాలాల మండలం అన్నాసాగర్ గ్రామంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
అంగన్‌వాడీ సిబ్బంది, ఆశావర్కర్లు ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.
]]>మండల అధ్యక్షులను ప్రకటించిన టీఆర్ఎస్
https://www.prajabandhu.in/trs-announced-mandal-presidents/
Tue, 14 Sep 2021 11:53:24 +0000https://www.prajabandhu.in/?p=1265తాండూరు: తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. తాండూరు పట్టణ అధ్యక్షుడిగా నయ్యుం అఫ్ఫు, తాండూరు మండల అధ్యక్షుడిగా రాందాస్, యాలాల మండలానికి మల్లారెడ్డి, పెద్దేముల్ మండలానికి కొహిర్ శ్రీనివాస్, బాషీరాబాద్ మండలానికి రామునాయక్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి జహంగీర్ పాషా సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుల పేర్లు వెల్లడించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కమిటీలు పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో దేశంలోనే అత్యంత వేగంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
]]>ఈ నెల 25న యాలాల మండల సమావేశం
https://www.prajabandhu.in/%e0%b0%88-%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2-25%e0%b0%a8-%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b1%87%e0%b0%b6%e0%b0%82/
Fri, 20 Aug 2021 06:00:59 +0000https://www.prajabandhu.in/?p=828తాండూరు: ఈ నెల 25వ తేదీన యాలాల మండల సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ పుష్పలీల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ బాలేశ్వర్ గుప్త అధ్యక్షతన మండల పరిషత్ సమావేశ హాలులో ఈ సమావేశం జరుగుతుందన్నారు. మండల పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆమె పేర్కొన్నారు.
]]>ఓపెన్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
https://www.prajabandhu.in/%e0%b0%93%e0%b0%aa%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%be%e0%b0%a0%e0%b0%b6%e0%b0%be%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5%e0%b1%87%e0%b0%b6%e0%b0%be%e0%b0%b2%e0%b0%95/
Thu, 19 Aug 2021 05:52:44 +0000https://www.prajabandhu.in/?p=814యాలాల: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎంఈఓ సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పదవ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పలు కారణాలతో మధ్యలో చదువు ఆపేసిన వారికి ఇది మంచి అవకాశమని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం యాలాల బాలుర ఉన్నత పాఠశాల ఓపెన్ స్కూల్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్‌ను 8328379942 నంబర్‌కు కాల్ చేసి సంప్రదించాలని సూచించారు.
]]>శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
https://www.prajabandhu.in/%e0%b0%b6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b1%87%e0%b0%95-%e0%b0%aa%e0%b1%82%e0%b0%9c%e0%b0%b2%e0%b1%81/
Mon, 16 Aug 2021 05:58:27 +0000https://www.prajabandhu.in/?p=731తాండూరు: యాలాల మండలంలోని రాస్నం గ్రామ శివాలయంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నూతన ధ్వజస్తంభ ఏర్పాటు కార్యక్రమాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శివాలయంలో గత మూడు రోజులుగా గణపతి, ఆంజనేయుడు, శివలింగం, పార్వతీపరమేశ్వరులు, వీరభద్ర, నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం ధ్వజస్తంభ ఏర్పాటుతో కార్యక్రమాలు పూర్తయ్యాయి.