తాండూరు: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను తాండూరు పట్టణంలోనీ పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేయనున్న చలివేంద్రం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చలివేంద్రాల ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.