తాండూరు: సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరం అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు రూ.6 లక్షల 90 వేల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల అభివృధ్ది, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృధ్ది పథంలో దూసుకుపోతోందన్నారు.